Vemulawada: వేములవాడను నీవే కాపాడాలి రాజన్నా…

దిశ దశ, వేములవాడ:

వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పులో భాగంగా జరుగుతున్న నిర్మాణాల కూల్చివేతలపై ఇంకా నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. హై కోర్టు స్టే విధించినప్పటికీ అధికారులు భవనాల కూల్చివేత చేపట్టడం సరికాదంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రమదారి విస్తరణలో భాగంగా చేపట్టిన భవనాల కూల్చివేతపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాలను తొలగిస్తున్న తీరుపై పట్టణంలోని పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు బాధితులు. రాజన్నపైనే అంతా భారం వేస్తున్నామంటూ అందులో పేర్కొనడం గమనార్హం. ఫ్లెక్సీలలో ఎమని ముద్రించారంటే..? తాము అభివృద్దిని అడ్డుకోవడం లేదని, హైకోర్టు స్టే విధించినప్పటికి భవనాలను కూల్చివేయడం ఎంత వరకు సమంసజం అని ప్రశ్నించారు. చట్ట వ్యతిరేకంగా జరుపుతున్న భూ సేకరణ చేయడాన్ని ప్రశ్నించడం తప్పా..?, తమ ఆస్తుల విలువను తమ ఇష్టానుసారం మదింపు చేసిన తీరును ప్రశ్నించడం తప్పా..?, అభివృద్ది పేరిట చెరువును ఆక్రమించుకుని పదేళ్లయినా ఇంతవరకూ ఎందుకు అభివృద్ది చేయడం లేదు..? అభివృద్ది పేరిట విధ్వంసం సృష్టిస్తున్నారు, ఇంతరవకూ రెండో బ్రిడ్జి నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదు..? యాత్రికులకు మౌళిక వసతులు కల్పించడంలో గత ప్రభుత్వం తరహాలోనే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అంటూ ఆ ఫ్లెక్సీలలో ముద్రించారు. మదింపు చేసిన వేములవాడను నీవే కాపాడాలని రాజన్నా… నీ సహాయ సహకారములు ఆశిస్తూ మెయిన్ రోడ్ భూసేకరణ నిర్వాసితులు అని ముద్రించిన ఫ్లెక్సీలను పట్టణంలోని పలుచోట్ల ఏర్పాటు చేయించారు.

తొలగింపు…

అయితే పట్టణంలోని భూనిర్వాసితులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను మునిసిపల్ సిబ్బంది తొలగించారు. ఫ్లెక్సీల ద్వారా తమ నిరసన ప్రదర్శన చేపట్టారన్న సమాచారం అందుకున్న మునిసిపల్ అధికారులు వాటిని తొలగించేందుకు సిబ్బందిని పంపించారు.

Latest NewsRajanna Sirisilla districtsri raja rajeshwara templetelangana newsvemulawada