పోలీసుల అదుపులో ఐధుగురు… అరెస్ట్ కు రంగం సిద్దం..?

దిశ దశ, కరీంనగర్:

ఎన్నికల హడావుడిలోనూ కరీంనగర్ పోలీసులు నిందితుల కోసం చేస్తున్న హంటింగ్ మాత్రం ఆపడం లేదు. ఓ వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతున్నా మరో వైపున నిందితులను వెతికి మరి పట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ఎన్నికల కారణంగా ఎలాంటి దరఖాస్తులు తీసుకునే అవకాశం లేదని, పోలింగ్ తరువాత బాధితులు కమిషనరేట్ కార్యాలయానికి రావాలని ప్రకటించినప్పటికీ పాత కేసుల్లో నిందితులను మాత్రం వదలడం లేదు పోలీసు అదికారులు. తాజాగా కరీంనగర్ కు చెందిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ కు చెందిన వీరంతా కూడా భూ దందాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నట్టుగా సమాచారం. వీరిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొద్ది సేపట్లో అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చనున్నాట్టు సమాచారం.

crimecrime newskarimnagar newstelangana news