విజయవాడ హైవేపై దగ్దమైన ప్రైవేట్ బస్సు…

ప్రయాణీకులు సేఫ్…

దిశ దశ, నల్గొండ:

ప్రైవేటు బస్సుల ప్రమాదాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో బస్సులో మంటలు చెలరేగడంతో దగ్దం అయింది. సంఘటనా వివరాల్లోకి వెలితే… హైదరాబాద్ నుండి ఒంగోలు వైపునకు వెల్తున్న ప్రైవేటు బస్సు 65 నేషనల్ హైవేలోని చిట్యాల మండలం పట్టంపల్లి వద్దకు చేరుకుంటున్న సమయంలో బస్సు ఇంజన్ లో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తంగా ఉన్న ప్రయాణీకులు ఎమర్జెన్సీ డోర్ ద్వారా బస్సులోంచి బయటకు రావడంతో అంతా సేఫ్ అయ్యారు. బస్సులో 29 మంది ప్రయాణీకులు ఉన్నారని, ఇంజన్ లో మంటలు రావడంతో ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష్య సాక్షులు చెప్తున్నారు. విహారీ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు నాగాలాండ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ ఒంగోలుకు ప్రయాణీకులను చెరవేసేందుకు పర్మిట్ తీసుకుని నడుపుతున్నట్టుగా సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక సీఐ నాగరాజు మాట్లాడుతూ… ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయిందని, ప్రయాణీకులంతా సేఫ్ గా ఉన్నారని తెలిపారు.

crimefire accidentLatest Newsnalgondavijayawada highway