కరీంనగర్ లో అగ్రి ప్రమాదం

బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో చెలరేగిన మంటలు

రంగంలోకి దిగిన ఫైర్ స్టేషన్ సిబ్బంది

కరీనంగర్ నడి బొడ్డున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని టవర్ సర్కిల్ లో ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. బుధవారం రాత్రి బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది హుటాహటిన బీఎస్ఎన్ఎల్ ఆఫీసుకు చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఈ ఘటన షాట్ సర్క్యూట్ వల్లే జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అన్న వివరాలపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే టవర్ సర్కిల్ మెయిన్ సెంటర్ లో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ యంత్రాంగం రంగంలోకి దిగడంతో భారీ ప్రమాదం తప్పినట్టేనని భావించాలి. లేనట్టయితే ఈ కార్యాలయ సమీపంలోనే పోస్ట్ ఆఫీస్, బ్యాంకు, పలు షాపింగ్ మాల్స్ ఉన్నాయి. కరీంనగర్ లో అతి పెద్ద వ్యాపార కూడలి కావడంతో వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేయనట్టయితే భారీ నష్టం వాటిల్లేది. బుధవారం రాత్రి వరకూ కూడా ఫైర్ యంత్రాంగం మంటలను ఆర్పే పనిలో నిమగ్నం అయి ఉంది.

cm kcrfire accidentkarimnagar newsKarimnagar Tower CircleLatest Newstelangana news