అర్థరాత్రి అగ్ని ప్రమాదం… రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్లు…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ కాంప్లెక్స్ లో సోమవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆవరణలోని యూనియన్ బ్యాంక్ కార్యాలయం నుండి పొగ బయటకు రావడంతో స్థానికులు గుర్తించి ఫైర్ విభాగానికి సమాచారం అందించారు. బ్యాంకులోపల షాట్ సర్క్యూట్ లేదా మరేదైనా కారణంతో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. ఒక్క సారిగా పొగ బయటకు రావడంతో బస్ స్టేషన లో ఉన్న ప్రయాణీకులు, స్థానికులు పెద్ద ఎత్తున గుమి గూడారు. ఫైర్ ఇంజన్లు ఘనటా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో బ్యాంకుకు సంబంధించిన ఫర్నీచర్ తో పాటు రికార్డులు, సిస్టమ్స్ దగ్దం అయి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

fire accidentkarimnagar newsrtc bus stationTS RTCunion bank