అంకురా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: ఎగిసి పడుతున్న మంటలు

దిశ దశ, హైదరాబాద్:

హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గుడిమల్కాపూర్ ఏరియాలోని ఓ ఆసుపత్రి భవనం పై అంతస్థులో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. మహా నగరంలోని గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ అంకురా ఆసుపత్రిలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో హై అలెర్ట్ అయ్యారు. ఆసుపత్రిలో చెలరేగిన మంటలను నిలవరించేందుకు ఫైరింజన్లు హుటాహుటిన చేరుకున్నాయి. ఆసుపత్రికి సంబంధించిన మెటిరియల్ ఈ అగ్ని ప్రమాదంలో కాలిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఆసుపత్రి భవనంలోని టెర్రస్ షాట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించిందని ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని అంతా క్షేమంగా ఉన్నారని వివరించాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ విభాగం అధికారులకు సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారని ప్రస్తుతం… మంటలు అదుపులోకి వచ్చాయని వివరించాయి.

ankura hospatalcrime newsgudimalkapurHyderabad city
Comments (0)
Add Comment