దళిత బిడ్డపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా..?

 

కల్వకుంట్ల కవిత

దిశ దశ, హైదరాబాద్:

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించిన ఘటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’ వేదికగా ఘాటుగా స్పందించారు. తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేస్తూ కవిత చేసిన కామెంట్స్ ఏంటంటే..? 

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే , దళిత బిడ్డ బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుంది. సూర్యుని పై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని మర్చిపోకండి. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిపై సీఎం రేవంత్ రెడ్డి గారు అసభ్య పదజాలాన్ని ప్రయోగించినందుకు ముందుగా రేవంత్ రెడ్డి గారిపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలి. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించి మీ వైఖరిని ఎండగడతాం. అంటూ ఎక్స్ వేదికగా హెచ్చరించారు.

BALKA SUMANBRS NEWSkalvakuntlaMLC KAVITHArevanth reddy
Comments (0)
Add Comment