ఆనందం వెంటనే విషాదం…


రోడ్డు ప్రమాదంలో వారసుని మృత్యువాత…

జగిత్యాల జిల్లాలో విషాదం

దిశ దశ, జగిత్యాల:

ఉపాధి కోసం గల్ఫ్ దేశాల కోసం వెల్లొచ్చిన ఆ తండ్రి కుటుంబ సభ్యులతో కలిసిన ఆనందం ఎంతో సేపు లేకుండా పోయింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పట్టణంలోని మహాలక్ష్మినగర్‌కు చెందిన చౌట్‌పల్లి మోహన్‌, పద్మిని ల కుమారుడు శివకార్తిక్‌(12) ఐదో తరగతి చదువుతున్నాడు. మోహన్‌ ఉపాధి కోసం పదేళ్ల క్రితం సౌదీ అరేబియా వెల్లి సోమవారం ఉదయం స్వస్థలానికి తిరిగి వచ్చాడు. ఇంట్లో తాగునీరు లేకపోవడంతో బైక్ పై శివకార్తిక్ ఇంటినుండి వెల్తుండగా బైపాస్‌ రోడ్డులోని అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టడంతో మృత్యువాత పడ్డాడు. ప్రమాదంలో గాయపడిన శివ కార్తిక్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. పదేళ్ల తరువాత ఇంటికి చేరుకున్న తండ్రి తనివితీరా తనయున్ని చూసుకోకముందే రోడ్డు ప్రమాదం శివ కార్తిక్ ను బలి తీసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.

crimecrime newsCRIME TODAYJAGITHYAL NEWStelangana crime newstelangana news