బట్టుపల్లిలో ఉద్రిక్తత… పోలీసులను అడ్డుకున్న గ్రామస్థులు

కారం పొడి చల్లి… పోలీసులను అడ్డుకుని…

ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు


దిశ దశ, మంథని:

పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నయి. కర్కశంగా మారిన కన్నతండ్రే కూతురిని గొడ్డలితో నరికి చంపి మరోకరిపై దాడిచేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా చేయిదాటిపోయాయి. నిందితుడికి తామే శిక్ష విధిస్తామంటూ గ్రామస్థులంతా ఏకమై అతని వెంట పడుతుండడంతో పోలీసులు వారిని నిలువరించడానికి ఇబ్బందులు పడ్డారు.

సంఘటనా వివరాల్లోకి వెల్తే…

పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లికి చెందిన గురువారం గుండ్ల సదానందం కూతురు రజిత(11)ను గొడ్డలితో నరికి చంపి గ్రామంలోని మరో వ్యక్తిపై దాడి చేశాడు. హత్య గురించి సమాచారం అందుకున్న మంథని పోలీసులు బట్టుపల్లికి చేరుకుని నిందితుడు సదానందంను అదుపులోకి తీసుకున్నారు. దీంతో గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోతూ గ్రామం నుండి పోలీసు వాహనం కదలకుండా అడ్డుకున్నారు. దారికి అడ్డంగా కట్టెలు వేసి బొలేరోలో ఉన్న నిందితున్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు గ్రామస్థులను నిలవరించలేక ఇబ్బందులు పడ్డారు. పెద్ద ఎత్తున గ్రామస్థులు పోలీసుల అదుపులో ఉన్న సదానందంను తమకు అప్పగించాల్సిందేనంటూ వాహనం వద్దకు వెల్లడంతో వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్థులు నిందితునిపై దాడి చేసేందుకు కారం పొడి కూడా తీసుకవచ్చి అతనిపై చల్లేందుకు ప్రయత్నించగా వారిని వాహనం వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ కోపంతో ఉన్న గ్రామస్థులు కారంపొడి గాల్లోకి విసరడంతో పోలీసులు కొంతమంది ఇబ్బంది పడ్డారు. నిందితుడు సదానందంతో గతంలో అతని భార్యను చంపిన కేసులో కూడా జైలు జీవితం గడిపి వచ్చాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సైకోలా వ్యవహరించిన సదానందనం వల్ల తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

crimecrime newsCRIME TODAYLatest NewsMANTHANIPEDDAPALLY DISTRICTtelangana crimetelangana crime newstelangana news