ఆవిర్భావ దినోత్సవాన ఆగని నిరసనలు

అధికార పార్టీ నేతలను అడ్డుకున్న రైతులు

దిశ దశ, మంథని:

ఓ వైపున దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటు సంబరాల్లో మునిగి తేలుతుంటుంటే అక్కడ మాత్రం అధికార పార్టీ నాయకులకు నిరసన సెగ తగిలింది. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో రైతులు ధాన్యం కొనుగోళ్ల తీరుపై చేపట్టిన ఆందోళన సంచలనంగా మారింది. జిల్లాలోని మంథని మార్కెట్ యార్డు ఆవరణలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ తో పాటు పలువురు నాయకులు వెల్లారు. దీంతో యార్డులో ధాన్యం విక్రయించేందుకు వెల్లిన వారిని రైతులు అడ్డుకోగా నాయకులు బలవంతంగా లోపలకు వెళ్లారు. జాతీయ పతాకావిష్కరణ చేస్తున్న క్రమంలో యార్డు గేటు వేసి నిరసన వ్యక్తం చేశారు. సకాలంలో ధాన్యం కొనకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని వెంటనే రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోల్లు జరిపించాలని వారు డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎక్కటి అనంతరెడ్డి రైతులతో మాట్లాడి వారికి నచ్చజెప్పారు.

cm kcrgangula kamlakarKCRLatest NewsMANTHANIPEDDAPALLY DISTRICTtelangana news