అనకాపల్లిలో కుటుంబం ఆత్మహత్య… నలుగురి మృత్యువాత… ఒకరి పరిస్థితి విషమం…

దిశ దశ, ఏపీ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సైనేడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడగా నలుగురు మృత్యువాత చెందారు. విషమంగా ఉన్న మరోకరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు… తెనాలి పట్టణానికి చెందిన శివరామకృష్ణ కుటుంబం కొంతకాలం అనకాపల్లిలో నివాసం ఉంటున్నారు. గురువారం అర్థరాత్రి శివరామకృష్ణ, అతని భార్య మాధవి, కూతుర్లు వేద వైష్ణవి (15), జాహ్నవి (13), కుసుమల (9)లు సైనేడ్ తాగి ఆఈత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో నలుగురు చనిపోగా కుసుమను స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం రాత్రి 11 గంటల నుండి 12 గంటల మధ్య వీరంతా సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా బావిస్తున్నారు. అనకాపల్లి పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

ap crime newsbreaking newscrime newsCRIME TODAY
Comments (0)
Add Comment