Maoist: బడే దామోదర్ క్షేమంగా ఉన్నాడు… నకిలీ ప్రెస్ నోట్లు బలగాల సృష్టే….

మావోయిస్టు పార్టీ ప్రకటన

దిశ దశ, దండకారణ్యం:

తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ క్షేమంగానే ఉన్నాడని, పార్టీ పేరిట విడుదల అయిన లేఖలు బలగాలు విడుదల చేసి అయోమయం గురి చేసే ప్రయత్నం చేశాయని మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిది సమత వెల్లడించారు. ఈ మేరకు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పలు అంశాలను ఊటంకించారు. ఈ నెల 16, 17వ తేదిలలో జరిగిన ఘటనలో గ్రామీణులతో పాటు ప్రజలకు వైద్య సేవలందించేందుకు వెల్లిన వారిని ఎన్ కౌంటర్ పేరిట చంపేశారని ఆరోపించారు. తెలంగాణ కార్యదర్శి బడే దామోదర్ క్షేమంగానే ఉన్నారని సమత ప్రకటించారు. బీజాపూర్ జిల్లా ఉసుర్ బ్లాక్ పరిధిలోని సింగవరం, తుమ్‌డేపల్లి, మల్లెం పెంట, పూజారి కంకేర్, తేమల్‌బట్టి గ్రామాలను 8 వేల మంది పోలీసు బలగాలు చుట్టుముట్టాయని ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు, నలుగురు గ్రామీణులను ఎదురు కాల్పుల పేరిట చంపారని ఆరోపించారు. అనంతరం మృతదేహాలను తీసుకెళ్లిన బలగాలు కొంతమంది సామాన్యులను కూడా పట్టుకెళ్లారని వారిని కూడా రివార్డు ప్రకటించిన నక్సలైట్ల ముసుగులో చంపే ప్రమాదం ఉందని సమత ఆందోళన వ్యక్తం చేశారు. కార్పోరేటీకరణకు వ్యతిరేకంగా బ్రాహ్మణీయ ఫాసిస్టు ప్రభుత్వానికి, కగార్ యుద్దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని సమత పిలుపునిచ్చారు. పూజారి కాంకేర్ ఘటన తరువాత మావోయిస్టుల పేరిట లేఖలు విడుదల చేసిన పోలీసులు ప్రజల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేశారన్నారు.

bastarchhattisgarhDANDKARNYAMLatest Newsmaoist