హై కోర్టును ఆశ్రయించిన సర్పంచ్…

దిశ దశ, హైదరాబాద్:

మరో రెండు రోజుల్లో పదవి కాలం ముగుస్తుందనగా ఓ సర్పంచ్ హై కోర్టును ఆశ్రయించారు. తాము గెల్చిన తరువాత కరోనా విపత్కర పరిస్థితుల వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొన్నామని తమను మరో ఏడాది పాటు సర్పంచ్ గా కొనసాగించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల సర్పంచ్ బొల్ల వేణుగోపాల్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డబ్లు.పి. నంబర్ 2410/2024, 2413.2024ల ద్వారా తన అభ్యర్థనను పరిశీలించాలని బొల్ల వేణుగోపాల్ హై కోర్టును కోరారు. ఆయన పిటిషన్ ను స్వీకరించిన హై కోర్టు బుధవారం విచారించనుంది.

flash newsHigh CourtLatest NewsSARPANCH
Comments (0)
Add Comment