రెండు రోజులుగా ఎదురు కాల్పులు… కర్రె గుట్టల్లో కొనసాగుతున్న సెర్చింగ్ ఆఫరేషన్…

దిశ దశ, దండకారణ్యం:

బీజాపూర్, ములుగు జిల్లాల సరిహధ్దుల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్విరామంగా కొనసాగుతోంది. బీజాపూర్ జిల్లాలోని నంబి అటవీ ప్రాంతం మీదుగా సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభం అయింది.  దాదాపు 2 వేల మంది కోబ్రా బలగాలు మావోయిస్టుల ఏరివేత కోసం తడపాల, డోలి పరిసర అటవీ ప్రాంతాలతో పాటు కర్రె గుట్టలపై కూంబింగ్ నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఓ సారి, గురువారం తెల్లవారు జామున రెండు సార్లు మావోయిస్టులకు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా లేకపోవడంతో అక్కడి అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావడం లేదు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు కానీ ముఖ్య నాయకుడు కానీ ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

chhattisgarhdandkaranyamDKSZCKARRE GUTTAmaoist news
Comments (0)
Add Comment