బీజాపూర్ అడవుల్లో ఎదురు కాల్పులు

దిశ దశ, దండకారణ్యం:

చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో మరోసారి ఎధురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులు, బలగాలకు మధ్య జరిగిన ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని జిల్లా పోలీసు వర్గాలు తెలిపాయి. జిల్లాలోని బాసగూడ ప్రాంతంలోని  చిన్న గెలూరు అటవీ ప్రాంతంలో ఏరియా డామినేషన్ పార్టీలు సంచరిస్తున్న క్రమంలో మావోయిస్టులు కాల్పులు జరిపారని అయితే ఆపరేషన్ లో పాల్గొన్న బలగాలు కూడా ఎదురు దాడికి దిగడంతో ఘటనా స్థలం నుండి మావోయిస్టులు అడవుల్లోకి వెల్లిపోయారని పోలీసులు తెలిపారు. సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ బలగాలు ఏరియా డామినేషన్ ఆపరేషన్ లో పాల్గొన్నట్టు వివరించారు.

bijapur forestchattisghardandkaranyammaoist
Comments (0)
Add Comment