పోలీసుల అదుపులో మాజీ మంత్రి అనుచరుడు..?


దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ పోలీసుల అదుపులో మరో కీలక నేత ఉన్నట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి ముఖ్య అనుచరుడిగా ముద్ర పడిన ఆయనను మంగళవారం ఉదయం కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బాధితులు కొంతమంది కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని ఆశ్రయించడంతో వివిధ కోణాల్లో విచారించి మాజీ మంత్రి అనుచరుడిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసు అధికారులు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించడం లేదు.

crime newsCRIME TODAYkarimnagar newsLatest Newstelangana news