జేసీబీ సహాయంతో గర్భిణీ తరలింపు

సర్పంచ్ చొరవతో ఆసుపత్రికి…

దిశ దశ, కోరుట్ల:

జగిత్యాల జిల్లాలోని అన్ని ప్రాంతాల రహదారులు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. వరద ఉప్పొంగుతుండడంతో వంతెనల మీదుగా రాకపోకలు కష్టతరంగా మారింది. మేడిపల్లి మండలం రాజలింగంపేట గ్రామానికి చెందిన గర్భిణీకి పురుటి నొప్పులు రావడంతో మార్గ మధ్యలో ఉన్న వాగు మీదుగా వరద నీరు పొంగి పొర్లుతోంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించే పరిస్థితి లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు సర్పంచ్ కు సమాచారం ఇచ్చారు. గ్రామ సర్పంచ్ జేసీబీ సాయంతో గర్భిణీని వాగు దాటించి ఆసుపత్రికి పంపించేందుకు చొరవ తీసకున్నారు. వాగు అవతలి వైపున సిద్దంగా ఉన్న అంబూలెన్స్ లో గర్భిణీనీ కోరుట్ల హస్పిటల్ కు తరలించారు.

2023 heavy rainsFloods 2023JAGITIAL NEWSLatest Newstelangana news