కండువాలు మారుతున్నాయ్…

దిశ దశ, జగిత్యాల:

రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే స్థానిక సంస్థల్లోనూ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఓ వైపున అవిశ్వాస తీర్మాణాలకు తెరలేపగా మరో వైపున పార్టీలు ఫిరాయించడం కూడా ఆరంభం అయింది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఇప్పటి వరకు నమ్ముకున్న పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే పనిలో నిమగ్నం అయ్యారు. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల మునిసిపల్ వైస్ ఛైర్మన్ గడ్డమీద పవన్, కౌన్సిలర్ రహీం, అడెపు మధులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు సమక్షంలో వీరు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

JAGITHYAL NEWSJAGITIAL NEWSkarimnagar newskorutlaKORUTLA MLA
Comments (0)
Add Comment