వయసు పెరిగిన కొద్ది జాగ్రత్తగా ఉండాలి: ఈటల రాజేందర్

దిశ దశ, సిద్దిపేట:

వయసు పెరిగినా కొద్ది, అనుభవం వచ్చినా కొద్ది ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం ప్రజ్ఞపూర్ హరిత హోటల్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయనను మాజీ ఎంపీ, జీజేపీ నేత జితేందర్ రెడ్డి చేసిన ట్విట్ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఏది పడితే అది చేయడం, ఆ తరువాత ఇది కాదు అదన్న అనడం సరికాదని, ఎవరి గౌరవానికి భంగం కలగే పద్దతుల్లో వ్యవహరించడకూడదు, ఎవరి స్వేచ్ఛని, ఎవరి గౌరవాన్ని ఎవరూ తగ్గించకూడదన్న విషయాన్ని బేసిక్ గా గుర్తు పెట్టుకోవాలని ఈటల రాజేందర్ హితవు పలికారు.

bjp newseatela rajendaretela rajenderkarimnagar newsLatest Newstelangana news