ఒడిషాలో ఎన్ కౌంటర్: కేంద్ర కమిటీ సభ్యుని మృతి…

దిశ దశ, దండకారణ్యం:

ఓ వైపున ఆయుధ విరమణ ప్రకటించిన మావోయిస్టులు అరణ్యాలు వీడి జనారణ్యాంలోకి వస్తున్నా…  ప్రభావిత రాష్ట్రాల్లో మాత్రం నక్సల్స్ ఏరివేత కొనసాగుతూనే ఉంది. ఒడిషాలోని కందమాల్ జిల్లాలో కూంబింగ్ చేపట్టిన బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు సహా నలుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. బుధవారం రాత్రి కందమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయని సమాచారం. మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ (CRPF), ఒడిషా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ (SOG), ఒడిషా రాష్ట్ర పోలీసులు బెల్ఘర్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. బుధవారం రాత్రి మావోయిస్టులు తారసపడడంతో ఎదురు కాల్పులు జరిగినట్టుగా ఒడిషా రాష్ట్ర పోలీసు వర్గాలు ప్రకటించాయి. ఈ ఎన్ కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు ఊకే గణేష్ అలియాస్ పాక హన్మంతు, చత్తీస్ గడ్ రాష్ట్రంలోని రాయిగడ ప్లాటూన్ ఏరియా కమిటీ సభ్యుడు, ప్లాటూన్ మెంబర్ రాకేష్ అలియాస్ బారీ, సప్లై టీమ్ మెంబర్ అమృత్ లను గుర్తించారు మిగతా వారిని గుర్తించాల్సి ఉందని పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. రూ. కోటి. 10 లక్షల రివార్డు ఉన్న ఊకె గణేష్ తెలంగాణలోని నల్గొండ జిల్లా చందూర్ మండలం పుల్లెంల వాసి కాగా మిగతా వారంతా చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన వారుగా తెలుస్తోంది. ఘటనా స్థలం నుండి ఒక AK47, 2 INSAS, 303 రైఫిల్, స్వాధీనం చేసుకున్నారు. 

central committeedandkaranyammaoist newsMAOIST PARTYOdisha