డబ్లుసీడీఎస్సీ విభాగంలో పదోన్నతులు

జీఓ విడుదల చేసిన ప్రభుత్వం

దిశ దశ, కరీంనగర్:

ఉమెన్ చిల్డ్రన్, డిసెబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ విభాగంలో పలువురు అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. రాష్ట్రంలోని 8 మంది అసిస్టెంట్ డెరక్టర్లకు డిప్యూటీ డైరక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ జీఓఆర్టీ 46 జారీ అయింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పెద్దపల్లి జిల్లా డబ్లుసీడీఎస్సీ అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్న ఈ అక్కేశ్వర్ రావు ను హైదరాబాద్ డిప్యూటీ డైరక్టర్ గా, యాదాద్రి భవునగిరి జిల్లా ఏడి కెవి కృష్ణవేణిని నల్గొండ జిల్లా వెల్ఫైర్ ఆఫీసర్ గా, ఖమ్మం జిల్లా అసిస్టెండ్ డైరక్టర్ సి సుభద్రను కొత్తగూడెంకు, మెదక్ ఏడీ ఎస్ కె రసూల్ బీని నిజామాబాద్ కు, హన్మకొండ ఏడి వరలక్ష్మికి మహబూబాబాద్ కు, కమిషనర్ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న పద్మజ రమణను రంగారెడ్డికి, మహబూబాద్ లో పని చేస్తున్న సంధ్యారాణిని కరీంనగర్ కు బదిలీ చేశారు. వీరంతా కూడా డిప్యూటీ డైరక్టర్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

cm kcrLatest NewsPromotion fair in women and child welfare departmenttelangana news