స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ దాడులు…

దిశ దశ, హైదరాబాద్:

స్పా సెంటర్లపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేయడం ఆరంభించారు. స్పా సెంటర్ల ద్వారా క్రాస్ మసాజ్ విధానానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో పోలీసులు దాడులకు పూనుకున్నారు. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు స్పా సెంటర్లపై దాడులు చేసిన పోలీసులు ఐదుగురు యువతులతో పాటు మరో యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ స్పా సెంటర్ల నిర్వాహకులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశామని గుడిమల్కాపూర్ పోలీసులు తెలిపారు. అయితే నిభందనలకు విరుద్దంగా సాగుతున్న వీటిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

ఖాళీ చేయించేందుకూ… 

హైదరాబాద్ పోలీసులు నిభందనలకు విరుద్దంగా నడుస్తున్న స్పా, స్నూకర్ సెంటర్ల నిర్వహాకులపై చర్యలు తీసుకోవడమే కాకుండా వాటికి అద్దెకు ఇచ్చిన భవనాల యజమానులకు కూడా నోటీసులు ఇస్తున్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యాపారాలకు ఇండ్లను అద్దెకు ఇవ్వకూడదని ఆ నోటీసుల్లో పేర్కొంటున్నారు పోలీసులు. అసాంఘీక కార్యక్రమాలకు దూరంగా యువత ఉండాలని పోలీసులు హితవు పలుకుతున్నారు. 

crime newsCRIME TODAYHyderabad citySpa centerstelangana crime news
Comments (0)
Add Comment