ధరఖాస్తుల వెల్లువ… గాంధీ భవన్ కు క్యూ కట్టిన ఆశావాహాులు

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం డిమాండ్ ఫుల్ గా పెరిగిపోయినట్టుగా ఉంది. రానున్న లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని 17 లోక సభ స్థానాల నుండి పోటీ చేసేందుక అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే 140 వరకు దరఖాస్తులు గాంధీభవన్ లో చేసుకున్నారంటే ఏ స్థాయిలో పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటీలో ఎక్కువగా పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్ సీట్ల నుండి పోటీ చేసేందుకు ఎక్కువ సంఖ్యంలో దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని ఒక్క హైదరాబాద్ స్థానానికి మాత్రమే అతి తక్కువగా అప్లికేషన్లు వచ్చాయని మిగతా అన్ని చోట్ల కూడా డిమాండ్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. 

2024 Electionscm revanth reddyCongressLatest Newstelangana news
Comments (0)
Add Comment