విద్యార్థిని ఆత్మహత్య…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ ఓ ప్రభుత్వ వసతి గృహంలో డిగ్రీ చదువుకుంటున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ సమీపంలోని నగునూరు సోషల్ వెల్ఫైర్ బాలికల డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఈయర్ చదువుతున్న సృజన (19) హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోయింది. సృజన మానకొండూరు మండలం గంగిపల్లికి చెందినది. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

crime newsCRIME TODAYkarimnagartelangana crime news
Comments (0)
Add Comment