టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. యువ నటుడు ఆత్మహత్య

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యువ నటుడు సుధీర్ వర్మ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతో విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సుధీర్ వర్మ మృతిపై పలువురు టాలీవుడ్ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ వర్మ మరణానికి సంతాపం ప్రకటిస్తున్నారు.

సుధీర్ వర్మ సెకండ్ హ్మాండ్, షూటైట్ ఎట్ ఆలేరు, కుందనపు బొమ్మ వంటి సినిమాల్లో నటించారు. అయితే ఈ నెల 18న అర్థరాత్రి సుధీర్ వర్మ హైదరాబాద్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విషం తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేయగా.. కుటుంబసభ్యులు గమనించి అడ్డుకున్నారు. సుధీర్ వర్మను ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందించారు.

అయితే ఈ నెల 20న సుధీర్ వర్మను హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నంకు తరలించారు. వైజాగ్ లోని ఎల్.జి ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. చికిత్స అందించే క్రమంలో ఆరోగ్యం మరింత క్షీణించడంతో సుధీర్ వర్మ మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజుమున మృతి చెందగా.. కుుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. సుధీర్ వర్మ ఆత్మహత్య వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది., దీంతో పలువురు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు.

సుధీర్ వర్మ ఆత్మహత్య వార్త తెలుసుకున్న పోలీసులు.. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. సుధీర్ వర్మ ఇంటికి చేరుకుని కుటుంసభ్యుల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మృతదేమాన్ని పోస్టుమార్టం చేసి ఆ తర్వాత కుటుంబసభ్యులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పోస్టుమార్టం నిర్వహించకుండా కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అందించడంపై పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సుధీర్ వర్మను విశాఖపట్నం ఎందుకు తరలించారు.? ఏం జరిగింది..? అనే దానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

tolly woodTollywood Latest NewsTollywood Newsvizag newsvizak