ఏపీకి మండాస్ ముప్పు…

తమిళనాడులో ప్రళయం సృష్టిస్తున్న మండాస్ తుపాను మరి కొన్ని గంటల్లో ఏపీని తాకనుంది. మహాబలిపురం వద్ద తీరం దాట నున్న ఈ తుపాను వల్ల నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య, సత్యాసాయి జిల్లాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండగా, ప్రకాషం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, శనివారం 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు రాకుండా ఉండాలని అధికారులు సూచించారు.

ap newsCyclone threat to APLatest Newsys jagan cmఏపీలో తుపాను ప్రభావం