కుంగిపోయిన రోడ్డు… కంగారు పడ్డ జనం

దిశ దశ, న్యూ ఢిల్లీ:

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో మరో సారి రోడ్డు కుంగిపోయిన ఘటన కలకలం సృష్టించింది. జనక్ పురి ప్రాంతంలోని మెయిన్ రోడ్డు ఒక్క సారిగా కుంగిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీ జనక్ పురి ప్రధాన రహదారిపై రోడ్డు కుంగిపోవడంతో భారీ సైజులో గుంత ఏర్పడింది. సుమారు నాలుగు గజాల వృత్తాకరంలో ఏర్పడిన ఈ గుంత గజం లోతు వరకూ పడి ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. సడెన్ గా రోడ్డు కుంగిపోవడంతో కంగారు పడిపోయిన స్థానికులు ఆ ప్రాంతం నుండి పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు రోడ్డు కుంగిపోయిన ప్రాంతం చుట్టూ బారిగేట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ మళ్లించారు. ఈ ఘటనలో స్థానికులు ఎవరూ గాయపడలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Crooked road in DelhiLatest Newsnew delhi