‘బండి’కి బెయిల్…

దిశ దశ, వరంగల్:

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కి బెయిల్ ఇస్తూ వరంగల్ కోర్టు కొద్ది సేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి రూ. 20 వేల చొప్పున ఇద్దరి ష్యూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు వరంగల్ కోర్టులో బీజేపీ లీగల్ టీమ్ అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసే పనిలో నిమగ్నం అయింది. శుక్రవారం ఉదయం సంజయ్ కరీంనగర్ జైలు నుండి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పులో కీలకమైన కామెంట్స్ ఉన్న నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి వరంగలో కోర్టులో నెలకొంది. తీవ్ర ఉత్కంఠతల మధ్య ఎట్టకేలకు బండి సంజయ్ శుక్రవారం బయటకు రానున్నారు. ఇక సంజయ్ కి బెయిల్ రాదని, సోమవారం తరువాతే ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చలు సాగాయి. కానీ జ్యుడిషరీ ఆఫీసర్స్ ఇచ్చిన ఆదేశాలతో సంజయ్ బెయిల్ పై శుక్రవారం ఉదయం రానున్నారు.

bandi sanjaybandi sanjay mpbjp chief bandi sanjaybjp newscm kcrLatest Newstelangana news