కేసీఆర్ పై పోటీకీ సై అంటున్న OU స్టూడెంట్

దిశ దశ, కరీంనగర్:

ఉద్యమాల ఖిల్లా ఉస్మానియా యూనివర్శిటీలో సరికొత్త చైతన్యం మొదలైనట్టుగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బరిలో నిలిచేందుకు ఓయూ లా స్టూడెంట్ సై అంటున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తికి చెందిన వెంకటేష్ కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకున్న వెంకటేష్ తనకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. నిరుద్యోగ భృతి, దళితుల కోసం ఇచ్చిన హామీలు, ఏక కాలంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తున్నారని వెంకటేష్ అంటున్నారు. సీఎం కేసీఆర్ ఓటమే లక్ష్యంగా తాను ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని, తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు వెల్లడించారు.

bjp newscm kcrkarimnagar newsLatest NewsOsmaniatelangana news