ప్రజాస్వామ్య పునరుద్దరణలో మీ పాత్ర మరవలేనిది…టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి…

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి కొద్దిసేపటి క్రితం ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారకులైన వారందరికీ అభినందనలు తెలుపారు. తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించయిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికి ధన్యవాదాలు తెలియజేశారు. గడచిన పదేళ్ళుగా అడుగడుగునా అణిచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా నికార్సుగా నిలబడ్డారన్నారు. మీ కష్టం, మీ శ్రమ, వృధా కాలేదు… తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్దరణలో మీ అందరి పాత్ర మరవలేనిది, ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ‘ఎక్స్’ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల వెనక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఖచ్చితమైన సంకేతాలు అందినట్టుగా స్పష్టతిచ్చినట్టయింది. నిఘా వర్గాలు ఇచ్చిన నివేదికలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపే ఓటర్లు అనుకూలంగా ఉన్నారని గుర్తించాయి. అయితే గురువారం జరిగిన పోలింగ్ తరువాత నెలకొన్న పరిణామాలు కొందరిని మీమాంసకు గురి చేశాయి. కానీ తాజాగా రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా ఇచ్చిన సందేశంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నట్టుగా తేల్చిచెప్పినట్టయింది.

2023 assembly electionscm kcrCongress party has come to power in the state: Revanth Reddy's message is clearLatest Newstelangana newstpcc chief revanth reddy