ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ల ఆందోళన

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో ఆందోళన కొనసాగుతోంది. హైర్ బస్సుల డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం డ్యూటీలో జాయిన్ అయిన ఓ డ్రైవర్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయడం పట్ల హైర్ బస్సు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు టెస్టులు చేయాలనుకున్న డ్రైవర్ తాను మద్యం సేవించనని, అలవాటు లేదని చెప్తున్నా వినలేదని ఆరోపిస్తున్నారు. హైర్ బస్సుల డ్రైవర్ల ఆందోళనతో సమీప గ్రామాలకు వెళ్లాల్సిన బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణీకులతో పాటు విద్యార్థులు గమ్య స్థానాలకు చేరుకోలేక పోతున్నారు.

karimnagar newsLatest Newstelangana newstg rtcTS RTC