దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ లోని కార్ఖానగడ్డ ప్రభుత్వ పాఠశాల వద్ద పేరెంట్స్ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దడంతో పేరెంట్స్ శాంతించారు. పాఠశాలలోని 8వ తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్ ను టీచర్ తీవ్రంగా కొట్టడంతో పేరెంట్స్ వచ్చి సదరు ఉపాధ్యాయున్ని నిలదీసినట్టు సమాచారం. విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదంటూ పేరెంట్స్ పాఠశాల ఉపాధ్యాయులను మందలించినట్టు సమాచారం. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో స్కూల్ వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఈ సమాచారం అందుకున్న కరీంనగర్ త్రి టౌన్ పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.