బండి సంజయ్ పై బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ ఎంపీ, బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కరీంనగర్ బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయన మీడియాలో రూ. వంద కోట్లు యాడ్స్ ఇచ్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. కరీంనగర్ కార్పోరేటర్ కమల్ జిత్ కౌర్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సోహన్ సింగ్ లు మంగళవారం సాయత్రం కరీంనగర్ వన్ టౌన్ లో ఫిర్యాదు చేశారు. సోమవారం న్యూ డిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు ఎన్నికల్లో బంగారు పుస్తెలు అమ్మిన బండి సంజయ్ కి ఇప్పుడు వందలకోట్ల యాడ్స్ ఇచ్చే డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని కామెంట్ చేశారు. బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రఘనందన్ రావు చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని సీఆర్పీసీ 161 కింద రఘునందన్ రావు స్టేట్ మెంట్ ఆధారంగా కేసు నమోదు చేయాలని కోరారు. అయితే బండి సంజయ్ పదవికి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఆయనపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

bandi sanjaykarimnagar newsLatest Newstelangana news