సెంటిమెంట్ తప్పకుండా…

అభ్యర్థుల జాబితా ప్రకటన వెనక

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన సెంటిమెంట్ ను ఈ సారి కూడా ఫాలో అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపే విషయంలో ఆయన నెంబర్ ‘‘6’’ వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకునే జాబితాను విడుదల చేశారు. అయితే అనూహ్యంగా ఆయన 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో నెండర్ 7 వచ్చిందని అందరు చర్చించుకుంటున్నారు. కానీ ఇందులో కూడా కిటుకు ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్ జాబితా విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ పేర్లు మాత్రం 114మేనన్నది గమనార్హం. సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిల నుండి పోటీ చేస్తారని జాబితాలో పేర్కొనడంతో అభ్యర్థులు మాత్రం 114 మంది మాత్రమే అయ్యారు. దీంతో ఆయన సెంటిమెంట్ గా ఫీలయ్యే ఆరు నెంబర్ వచ్చిందని భావిస్తున్నారు.

cm kcrCM KCR's sentimentcrime newsLatest Newstelangana news