జగిత్యాలలో చిరంజీవిపై కోడిగుడ్లతో దాడి…

తెలుగు పాప్ సింగర్, ప్రముఖ గాయని స్మిత సోనీ లివ్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో నిజం విత్ స్మిత అనే టాక్ షో చేస్తోంది. ఈ టాక్ షోలో రాజకీయ, సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తోంది. అయితే ఈ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ కు చిరంజీవి అతిధిగా రాగా.. తొలి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రొమో తాజాగా విడుదలైంది. దాదాపు 30 సెకన్ల పాటు ఈ ప్రొమో ఉండగా.. ఇందులో పలు ఆసక్తికర విషయాలు చిరంజీవి పంచుకున్నారు.

జీవితంలో తనకు ఎదురైన పరాభవాల గురించి చిరంజీవి బయటపెట్టారు. గతంలో తనపై కోడిగుడ్లు విసిరిన ఘటనను కూడా బయటపెట్టారు. ఒకసారి తాను జగిత్యాల వెళ్లినప్పుడు తనను కోడిగుడ్లతో కొట్టారని చిరంజీవి తెలిపారు. అలాగే కాలేజ్ డేస్ లో మీ ఫస్ట్ క్రష్ ఎవరు అని అడగ్గా.. తాను చాలా అమాయకుడిని అని చిరంజీవి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా జీవితంలో ఎదురైన అవమానాల గురించి స్మిత అడగ్గా.. చిరు బయటపెట్టారు.

జగిత్యాల వెళ్లినప్పుడు తనపై పైనుంచి పూలవర్షంలా కురిసింది. కొంచెం ముందుకు వెళ్లగానే కోడిగుడ్లతో కొట్టారు అని తెలిపారు.అయితే ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అనే వివరాలు మాత్రం బయటకు చెప్పలేదు. పూర్తి ఎపిసోడ్ లో ఈ విషయాలు తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ ఎపిసోడ్ ఈ నెల 10 నుంచి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ షోకు చంద్రబాబు కూడా గెస్ట్ గా హాజరయ్యారు. చంద్రబాబు ఎపిసోడ్ కూడా త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.

ఇటీవల టాక్ షోల హవా నడుస్తోంది. ఆహా యాప్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ అన్‌స్టాఫబుల్ విత్ ఎన్‌బీకే పేరుతో టాక్ షో చేస్తుండగా.. ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలు గెస్ట్ లుగా వచ్చారు. పవన్ కల్యాణ్ ఎపిసోడ్ లో అన్‌స్టాఫబుల్ 2కు ఎండ్ కార్డ్ పడనుంది. ఇక ఈటీవీలో సుమా అడ్డా పేరుతో యాంకర్ సుమ మరో టాక్ షో చేస్తోంది. ఈ టాక్ షోకు కూడా తొలి గెస్ట్ గా చిరంజీవి హాజరయ్యారు.

CHIRANJEEVIMEGA BROTHERSMEGASTARTollywood Latest NewsTollywood News