దిశ దశ, కరీంనగర్:
సంచలనాలకు కేరాఫ్ గా నిలిచిన ధర్మ రక్షణ ఫౌండేషన్ ఛైర్మన్ చీకోటి ప్రవీణ్ శనివారం కరీంనగర్ లో పర్యటించనున్నారు. దర్యాప్తు సంస్థలతో విచారణ ఎదుర్కొన్న ఆయన ఇటీవల కాలంలో రాష్ట్రంలోనే హైలెట్ గా నిలిచారు. వన్యప్రాణులను వివిధ దేశాల నుండి తెప్పించుకున్న జీవులను తన ఫాం హైౌజ్ లో పెంచుకుంటూ జీవనం సాగించే ప్రవీణ్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన శనివారం ఓ సైకిల్ స్టోర్ ప్రారంభోత్సవానికి కరీంనగర్ వచ్చేందుకు ముహుర్తం ఫిక్స్ అయింది. శనివారం 11.30 గంటల ప్రాంతంలో చీకోటి జగిత్యాల రోడ్ లో ఏర్పాటు చేసిన ఎజె పెడల్స్ మల్టి బ్రాండ్ సైకిల్ షోరూం ప్రారంభోత్సవం చేయనున్నారు. షాపు యజమానులు ఆయనచే షోరూం ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మరి కొద్ది సేపట్లో చీకోటి ప్రవీణ్ కరీంనగర్ చేరుకోనున్నారు.