మల్లారెడ్డిపల్లి చెక్ డ్యాంకు గండి…


దిశ దశ, వీణవంక:

నిరాటంకంగా కురిసిన వర్షాలు… పోటెత్తిన వరదల ప్రభావంతో తీరని నష్టమే వాటిల్లింది. నదుల్లో చేపట్టిన నిర్మాణాలపై ఈ వరద ప్రభావం తీవ్రంగా పడింది. కరీంనగర్ జిల్లా మానేరు నదిలో చెక్ డ్యాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మానేరులో వరద ఉధృతంగా రావడంతో వీణవంక, ఓదెల మండలాల నడుమ నిర్మిస్తున్న చెక్ డ్యాం కట్ట కొట్టుకపోయింది. రెండు, మూడు రోజులుగా వరద నీటిలో మునిగి ఉన్న ఈ ప్రాంతంలో ప్రవాహం తగ్గు ముఖం పట్టడంతో ఒక్కోక్క విషయం వెలుగులోకి వస్తోంది. మల్లారెడ్డిపల్లి, కనగర్తి గ్రామాల మధ్యలో మానేరు నదిలో నిర్మాణంలో ఉన్న చెక్ డ్యాంకు సంబంధించిన కట్ట వరధ ధాటికి కొట్టుకపోయింది.

Check dam washed away by floodskarimnagar newsLatest Newstelangana news