ఆత్మీయ సమ్మేళనంలో హాహా కారాలు…

ఇద్దరు మృతి… పలువురికి గాయాలు

కారేపల్లిలో అగ్నిప్రమాదం

దిశ దశ, ఖమ్మం:

బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా సుమారు పది మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… ఖమ్మం జిల్లా కారేపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిరిపోయి ఓ పూరిగుడిసెపై పడ్డాయి. దీంతో గుడిసె పూర్తిగా దగ్దం కాగా అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, 10 మంది వరకు గాయపడ్డారని ప్రత్యక్ష్య సాక్షులు చెప్తున్నారు. ఈ దుర్ఘటనలో కొంతమంది శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడగా స్థానికులు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కొంతమంది జర్నలిస్టులు కూడా ఈ ఘటనలో గాయపడినట్టు తెలుస్తోంది. ఆందోళనకరంగా ఉన్న వారిని మెడికల్ కాలేజీకి తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరందరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరి కొద్దిసేపట్లో జరగనున్న ఆత్మీయ సమ్మేళనంలో అప్యాయతలు పంచుకోవల్సి ఉండగా అగ్నిప్రమాదం బీఆర్ఎస్ పార్టీలో విషాదం అలుముకుంది.

BRS NEWSBRS PARTYcrime newsCRIME TODAYkhammamKhammam newsLatest Newstelangana news