బెంగుళూరు ఎయిర్ పోర్టులో ఆ ఇద్దరి కలయిక…

దిశ దశ, జాతీయ:

ఏపీ పాలిటిక్స్ కు కూడా బెంగుళూరు కేంద్రంగా మంత్రాంగం నడుస్తోందా..?  ఎపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగుళూరు ఎయిర్ పోర్టులో చోటు చేసుకున్న పరిణామం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో శరవేగంగా మారుతున్న సమీకరణాల చుట్టే హాట్ టాపిక్ నడుస్తుంటే తాజాగా బెంగుళూరు ఎయిర్ పోర్టులో ఈ ఇద్దరు ముఖ్య నేతలు కలుసుకోవడం సంచలనంగా మారింది. గురువారం బెంగుళూరు ఎయిర్ పోర్టులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, కర్ణాటక డిప్యూటీ సీఎం డికె శివ కుమార్ కలుసుకున్నారు. ఎయిర్ పోర్టులోపలకు వెల్లిన డికె, చంద్రబాబు నాయుడును పలకరించిన తరువాత ఇద్దరు పక్కకు వెళ్లి మాట్లాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు నాయుడు, డికెలు ఏ విషయం గురించి రహస్యంగా మాట్లాడుకున్నారోనన్న విషయంపై ఆరా తీసే పనిలో పడ్డారు కొందరు. చంద్రబాబును కలిసేందుకే డికె ఎయిర్ పోర్టుకు చేరుకున్నారా లేక ఆయన టూర్ కు వెల్తున్న క్రమంలో చంద్రబాబును అనుకోకుండా కలిశారా అన్న విషయంపై క్లారిటీ లేనప్పటికీ వీరిద్దరు మాత్రం ప్రత్యేకంగా డిస్కషన్ చేసుకున్న విషయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి.

ap newsap politicsBangalore Airportdk shivakumarnara chandrababu naidu
Comments (0)
Add Comment