స్వర్గం నుండొచ్చిన ఎన్టీఆర్…

థాంక్యూ జగన్ ఫ్లెక్సీల కలకలం

దిశ దశ, ఏపీ బ్యూరో:

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తరువాత ఏపీలో జరుగుతున్న పరిణామాలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. చంద్రబాబు నాయుడును జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించిన గంటల్లోనే పలు చోట్ల సీనియర్ ఎన్టీఆర్ సీఎం వైఎస్ జగన్ కు థాంక్స్ చెప్తున్న ఫ్లెక్సీలు ప్రత్యక్ష్యం కావడం సంచలనంగా మారింది.

ఫ్లెక్సీలో ఏముందంటే…?

థాంక్యూ జగన్… నా ఆత్మకు శాంతి చేకూర్చావు… నన్ను చివరి దశలో అనేక అవమానాలకు, అత్యంత క్షోభకు గురి చేసి… నా మరణానికి కారణమైన ‘నీచుడు చంద్రబాబు’ నేను చనిపోయాక నా మరణాన్ని వాడుకొని, నా కుమారుడు హరికృష్ణ మరణాన్ని వాడుకుని చివరకి నా మనవడు తారకరత్న మరణాన్ని కూడా వీడి కొడుకు నీచ రాజకీయానికి వాడుకున్న నీచుడికి బుద్ది చెప్పి ‘నా ఆత్మకు శాంతిని చే కూర్చావు’’ నీచుడు , దుర్మార్గుడైన చంద్రబాబు సెప్టెంబర్ 10న జైలుకు వెల్తున్న సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజును ఆత్మ శాంతి దినోత్సవంగా జరుపుకోవాలని నా విజ్ఞప్తి. ఇట్లు… నందమూరి తారక రామారావు (సీనియర్ యన్.టి.ఆర్.) అంటూ రాశారు. ఈ ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి బొకె ఇస్తున్న ఫోటోలను కూడా అందులో ముద్రించారు.

చంద్రబాబు నాయుడు అరెస్టు తరువాత ఆయనపై ఎలాంటి సానుకూలత రాకూడదన్న కారణంగానే ఈ ఫ్లెక్సీలు వెలిశాయన్న చర్చ జరుగుతోంది. వైసీపీ నాయకులే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టుగా కూడా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా స్వర్గానికేగిన సీనియర్ ఎన్టీఆర్ పేరిట మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఫ్లెక్సీలు ప్రత్యక్ష్యం కావడం మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ap newsCelebrate Chandrababu's Arrest Day as Atma Shanthi Day: Arrangement of Flexi in Sr. NTR's NameChandrababu Naidu ArrestLatest Newstdp chiefys jagan cm