బండి సంజయ్ పై కేసు నమోదు…

దిశ దశ, హైదరాబాద్:

భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై క్రిమినల్ కేసు నమోదయింది. పోలీసుల విధులకు ఆటంకం కల్గించారని ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. బుధవారం చెంగిచర్లకు వెళ్లిన బండి సంజయ్ అనుమతి లేదని చెప్పినా వినకుండా బారికేడ్లను తోసుకుంటూ… పోలీసులకు తొక్కుకుంటూ గాయపర్చి వెళ్లారని నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బండి సంజయ్ తో పాటు మరో 9 మందిపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

bandi sanjaybjp mp bandi sanjaychengicharlaLatest Newstelangana news