పోలీసుల అదుపులో కాంగ్రెస్ నాయకుడు..?

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్పోరేటర్ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొద్దిసేపట్లో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చనున్నట్టుగా తెలుస్తోంది. అయితే గురువారం కరీంనగర్ మునిసిపాలిటీ కార్యాలయంలో అధికారులపై దురుసు ప్రవర్తనతో పాటు వారిని దుర్భాషలాడినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. కమిషనర్ తో పాటు మరో మహిళా అధికారిణి పట్ల మెండు చంద్రశేఖర్ (మార్షల్) వ్యవహరించిన తీరుపై కేసు నమోదు చేయనున్నట్టుగా సమాచారం. అధికార యంత్రాంగం విధులకు ఆటంక పర్చడంతో పాటు ఇతర నేరాల కింద మార్షల్ ను అరెస్టు చేస్తున్నట్టుగా సమాచారం.

crime newskarimnagar newstelangana crime newstelangana news