Dishadasha
Telugu Breaking News
  • facebook
  • twitter
  • google_plus
  • Email

కార్ డ్రైవర్ అకౌంట్లో రూ. 9 వేల కోట్లు..!

By Disha Dasha on September 22, 2023

దిశ దశ, చెన్నై:

చెన్నైలోని ఓ బ్యాంకు అధికారుల చర్యల వల్ల కొద్దిసేపు ఓ కారు డ్రైవర్ రూ. 9 వేల కోట్లకు అధిపతి అయ్యాడు. అసలు విషయం గమనించిన బ్యాంకు అధికారులు రాజ్ కుమార్ అకౌంట్ నుండి డబ్బును తిరిగి బదిలీ చేసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? కారు డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న రాజ్ కుమార్ మొబైల్ కు ఈ నెల9న ఓ మెసేజ్ వచ్చింది. తమిళనాడు మార్కెంటైల్ బ్యాంకు నుండి వచ్చిన ఈ మెసేజ్ సారాంశం చూసి రాజ్ కుమార్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. అతని అకౌంట్లో రూ. 9 వేల కోట్లు జమయ్యాయని మెసేజ్ వచ్చింది. అనుమానంతో మెసేజ్ ను ఒకటికి రెండు సార్లు చదువుకున్నాడు. అయినప్పటికీ తనలోని అనుమానం తీరకపోవడంతో తన స్నేహితుడికి రూ. 21 వేలు బదిలీ చేయగా అవి అతని అకౌంట్లో జమ అయ్యాయి. అయితే బ్యాంక్ అధికారులు రాజ్ కుమార్ కు ఫోన్ చేసి పొరపాటును రూ. 9 వేల కోట్ల మీ అకౌంట్ కు బదిలీ అయ్యాయని నగదు మొత్తాన్ని తిరిగి అప్పగించాలని కోరారు. దీంతో రాజ్ కుమార్ న్యాయవాదుల ద్వారా బ్యాంకు అధికారులను సంప్రదించాడు. రూ. 21 వేలు తిరిగి ఇవ్వాల్సిన పని లేదని, రాజ్ కుమార్ కు రుణంపై వాహనం కూడా ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పడంతో కథ సుఖాంతం అయింది.

Related

Car driver account Rs. 9 thousand crores..!ChennaiLatest News
  • Business News
Share
Related Posts

చలి… పులి..!

ములుగు జిల్లాలో ఇద్దరి హత్య: పద్దతి మార్చుకోకపోవడం వల్లే: మావోయిస్టు పార్టీ

న్యూ ఫీచర్స్ తో కొత్త మారుతి కారు: ప్రారంభించిన మంత్రి పొన్నం ది

యూపీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం… రెండో రాష్ట్రంగా రికార్డ్…

దసరా బంపర్ ఆఫర్… మెగా లక్కి డ్రా

గ‘మ్మత్తు’ వ్యాపారం… ట్రస్మా అధ్యక్షునికి వైన్ షాప్…

ఆరు ఎయిర్ బ్యాగుల జిమ్నీ… కరీంనగర్ మార్కెట్ లోకి ఎంట్రీ…

  • Home
  • వార్తలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • Business News
  • క్రైమ్
  • స్పోర్ట్స్
  • సినిమా
  • వైరల్
  • Devotional
  • Education
  • Health
  • Sports
  • Stories
View Desktop Version