విచారణకు రాలేను: ఎమ్మెల్సీ కవిత

గురువారం జరిపే విచారణకు రాలేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తనకు బిజీ షెడ్యూల్ ఉన్నందున రాలేనని వివరించారు. మార్చి 15వ తేదీ తర్వాత విచారణ కు వస్తానని చెప్పిన కవిత, 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాతో పాటు ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యుల్ ఉందని ఈడీకి వివరించారు. నోటీసులు వచ్చిన తరువాత న్యాయ నిపుణులతో చర్చించిన కవిత తన నిర్ణయాన్ని ఈడీకీ వివరించినట్టుగా తెలిసింది. దీంతో మార్చి 15 తరువాత ఈడీ డేట్ ఇచ్చినట్టయితే అప్పుడు విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

cm kcrDelhi Liquor ScamED notices for MLC KavithaLatest NewsLiquor scamMLC KAVITHAtelangana news