ఇంద్రావతి నదిలో పడవ బోల్తా…

ఫార్మసిస్ట్ గల్లంతు

చత్తీస్ గడ్ రాష్ట్రంలోని ఇంద్రావతి నదిలో పడవ మునిగిపోయిన ఘటన ఆందోళణ కల్గిస్తోంది. సుమారు 19 గంటల క్రితం అంటే సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఓ ఫార్మసిస్ట్ గల్లంతయినట్టు ప్రాథమిక సమాచారం. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఆయూష్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఫార్మసిస్ట్, హెల్త్ వర్కర్, స్టాఫ్ నర్స్ లు పడవలో ప్రయాణిస్తున్న క్రమంలో మునకకు గురి కావడంతో ఫార్మసిస్ట్ ప్రదీప్ కౌశల్ గల్లంతయ్యారు. కుషాల్ నార్ ప్రాంతంలో సేవలందించి తిరిగి వస్తున్న వైద్య బృందం పడవ ప్రమాదంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. బీజాపూర్ జిల్లా భైరంఘడ్ తాలుకాలో ఈ ఘటన సంభవించినట్టుగా ఆయుష్ విభాగం అధికారులు చెప్పారు. గల్లంతయిన ఫార్మసిస్ట్ ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది.

a pharmacist was missingAyushBijapyr DistrictBijapyr District newsCanoeCanoe overturned in chhattisgarhchhattisgarhchhattisgarh newsIndravati rivermedical teamsad news