ఎన్నెన్ని కష్టాలో… ఓటు తెచ్చిన తంటా…

ఐదేళ్ల పదవి కోసం నాయకుల విన్యాసాలు

దిశ దశ, కరీంనగర్:

రాజకీయ నాయకుల విన్యాసాలకు సరికొత్త వేదికగా నిలుస్తోంది కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఓటర్లను ఆకట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. రాజకీయాల్లో కురు వృద్దుడిగా ఉన్న జీవన్ రెడ్డి సైతం ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు గమ్మత్తుగా ఉన్నాయి. తమ నేతను గెలించాలని అభ్యర్థిస్తూ నాయకులు పసిపాపకు కాల కృత్యాలు తీర్చి స్నానం కూడా పోశారు. ఇలా చిత్ర విచిత్రాలకు వేదికగా నిలుస్తున్నాయి ఈ అసెంబ్లీ ఎన్నికలు. కొండగట్టు అంజన్న సన్నిధిలో ముడుపులు కట్టిన తరువా జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రె్డి గద పట్టుకుని హనుమంతుని హవాభావాలను ప్రదర్శించారు. ఏడు పదుల వయసుకు చేరుకున్న ఆయన ఓట్లు అభ్యర్థిస్తున్న తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఆరు గ్యారెంటీల గురించి ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఓ ఇంటి ఆవరణలో పసికందుకు స్నానం చేస్తున్న విషయాన్ని గమనించిన కాంగ్రెస్ నాయకులు చిన్నారికి ఎత్తుకుని కాలకృత్యాలు తీర్చి స్నానం చేయించారు. ఓట్లు అభ్యర్థించేందుకు అభ్యర్థులే కాకుండా వారి అనుచరులు కూడ ప్రచారంలో వింత పోకడలు అవలంభిస్తున్నారు. నామినేషన్ల పర్వంలోనే ఇలా ఉంటే పోలింగ్ తేది దగ్గర పడ్డాకొద్ది నాయకుల విన్యాసాలు ఏ స్థాయికి చేరుతాయోనన్న చర్చ కూడా సాగుతోంది.

2023 assembly elections2023 electionsCampaigns going on with the maneuvers of leaderskarimnagar newsLatest Newstelangana news