అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఢిల్లీ నుండి పిలుపు..!

దిశ దశ, కరీంనగర్:

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చినట్టుగా తెలిసింది. శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రచారంలో నిమగ్నం అయిన ఆయనకు ముఖ్య నాయకత్వం నుండి ఫోన్ రావడంతో హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. సాయంత్రం ఫ్లైట్ లో  ఢిల్లీకి చేరుకోనున్న నరేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులను కలిసి భేటీ కానున్నారు. అనంతరం ఏఐసీసీ పెద్దలను కలిసి  తన అభ్యర్థిత్వం గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న నరేందర్ రెడ్డికి ఢిల్లీ నుండి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

2025 MLC ELECTONSalphores CollegesAlphores Narender Reddymlc electionstelangana news