వాస్తు నిపుణుని ఇంటికి వాస్తు లేదేమో..?

ఇంట్లోకి చొరబడ్డ దొంగలు…

నగదు, బంగారం అపహరణ

దిశ దశ, హైదరాబాద్:

వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టినట్టయితే అన్ని అనుకూలంగా సాగుతాయని చెప్పి అష్ట దిక్కులపై అవగాహన కల్పించే ఓ వాస్తు నిపుణుడి ఇంటికే కన్న వేశారు దొంగలు. హైదరాబాద్ నగరంలోని మధురానగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ వాస్తు నిపుణులుగా పేరొందిన విఎల్ఎన్ ఇంట్లోకి చొరబడ్డి దొంగలు రూ. నాలుగు కోట్ల మేర నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము కుటుంబ సభ్యులతో సహా కలిసి ఊరికి వెల్లొచ్చేసరికి చోరీ జరిగిందని, ఇళ్లు కొనుగోలు చేసుకునేందుకు సమకూర్చుకున్న డబ్బును ఎత్తుకెళ్లారని వివరించారు. వాస్తు శాస్త్రంపై ప్రతి ఒక్కరికి విలువైన సూచనలు చేసే నిపుణుడి ఇంట్లోనే చోరీ జరిగిందంటే ఆయనకు వాస్తు శాస్త్రం కలిసి రావడం లేదేమోనన్న కామెంట్లు చేస్తున్నారు.

crimecrime newsCRIME TODAYLatest Newstelangana news