బీఆర్ఎస్ ఎంపీల నిరసన

దిశ దశ, న్యూఢిల్లీ:

ఉభయ సభల్లో మణిపూర్ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలో బీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టారు. మణిపూర్ అంశంపై చర్చ చేపట్టడంతో పాటు ఈ అంశంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ఎంపీలు కోరారు. దేశ వ్యాప్తంగా అట్టుడికిపోతున్న మణిపూర్ అంశం గురించి ఉభయ సభల్లో చర్చించడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ఈ నిరసనలో ఎంపీలు సంతోష్ కుమార్, నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, వెంకటేష్ నేత, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, పార్థసారధి రెడ్డిలతో పాటు రాజ్యసభ నుండి సస్పెండ్ అయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పాల్గొన్నారు.

BRS MPsBRS NEWSBRS PARTYcm kcrLatest Newstelangana news