లాక్స్ బ్రేక్ చేయండి…

23లోగా నివేదిక ఇవ్వండి

జగిత్యాల కలెక్టర్ కు హై కోర్టు ఆదేశం

దిశ దశ, జగిత్యాల:

ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూం విషయంలో హై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లాక్స్ బ్రేక్ చేసి పోలింగ్, కౌంటింగ్ ఫామ్స్ పంపించాలని జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాషాను ఆదేశించింది. ఈ నెల 23లోగా ఇందుకు సంబంధించిన వివరాలను తన ముందు ఉంచాలని స్పష్టం చేసింది. అయితే మొత్తం ఎపిసోడ్ అంతా కూడా వీడియో రికార్డింగ్ చేయాలని కూడా హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో జగిత్యాల అధికారులు ఒకటి రెండు రోజుల్లో ధర్మపురి స్ట్రాంగ్ రూం లాక్స్ పగలగొట్టే అవకాశాలు ఉన్నాయి.

adloori laxman kumarJAGITHYAL NEWSLatest Newsminister koppulatelangana news